శ్రీ నారాయణ పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.

తేది:25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్.

భూపాలపల్లి జిల్లా: మండల కేంద్రంలోని శ్రీ నారాయణ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను కులమత విభేధం లేకుండా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నాగనబోయిన రవి పాల్గొని మాట్లాడుతూ, అన్ని మతాలు ప్రేమ, శాంతి, మానవత్వాన్ని బోధిస్తాయని అన్నారు. విద్యార్థులు కుల,మత భేదాలను దాటుకుని ఐక్యతతో జీవించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ శశిధర చారి క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. విద్యార్థులు క్రిస్మస్ గీతాలు, నృత్యాలు, నాటికలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాఠశాల ప్రాంగణం క్రిస్మస్ అలంకరణలతో కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వప్న చారి ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *