తేది:23-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా:సదాశివపేట పట్టణం లోని ఊబ చెరువు లో మంగళవారం టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మత్స్య సహకార శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వం లో రాష్ట్రం లో మత్స్య పరిశ్రమ అభవృద్ధికి, పరిశ్రమ పై ఆధార పడ్డ కులాల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. భవిష్యత్ లో మత్స్య పరిశ్రమ పై ఆధారపడ్డ కులాలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం లో ఊబ చెరువు సొసైటీ చైర్మెన్ హనుమంత్, నాయకులు శంకర్,సిడిసి చైర్మెన్, సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మండల కాంగ్రెస్ నాయకులు సిద్దన్న, పిల్లోడి విశ్వనాథ్, ఆశిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు