జగిత్యాల నియోజకవర్గం ఓటరు జాబితా మ్యాపింగ్ అవగాహన సదస్సులో పాల్గొన్న-జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

తేది:23-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్.వి ఎల్ ఆర్ గార్డెన్ లో జగిత్యాల నియోజకవర్గం ఓటర్ జాబితా మ్యాపింగ్ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా నియోజకవర్గ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను నూతన ఓటర్ జాబితాలలో జనవరి 13 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
రాబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్టర్ మ్యాపింగ్‌ను సమర్థవంతంగా చేపట్టాలని, ఓటరు జాబితాల్లో ఉన్న డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను జాగ్రత్తగా గుర్తించి సరిచేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అంత్యంత ప్రధాన్యతగా పరిగణించాలని, నిర్ధేశిత గడువు లోగా అన్ని దశలను పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యంగా బ్లర్ ఫోటోలు ఉన్న ఓటరు ఎంట్రీలు, ఒకే వ్యక్తికి సంబంధించిన సమానమైన వివరాలతో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలను తప్పనిసరిగా పరిశీలించి సవరణలు చేపట్టాలని, బిఎల్ వో లకు, ఎమ్మార్వోలకు, డిటి లకు మరియు సూపర్ వైజర్లకు ఓటరు జాబితా పూర్తిగా తప్పులు లేకుండా సమర్థవంతంగా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, ఎమ్మార్వోలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *