
తేది:23-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా: సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని మండలాల తాసిల్దార్లు, ఆర్డీవోలు, ఆర్.ఐలు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, డిఆర్ఓ గారు మరియు అదనపు కలెక్టర్ గారితో కలిసి సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ దరఖాస్తులు, భూసంబంధిత సమస్యలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు.