తేది:22-12-2025మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: శెట్టిపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ పడిగే శేఖర్, ఉప సర్పంచ్ గా భవాని నాగులు గారు నియమితులయ్యారు గ్రామ పంచాయతీ సెక్రెటరీ సప్న గారు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గా సేవలు చేస్తున్న గడ్డం గట్టయ్య గారు, సన్మాన కార్యక్రమాన్ని వీరిచేతుల మీదుగా విజయవంతం చేశారు, కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీస్వప్న గారు మాట్లాడుతూ, గ్రామంలోని ఉన్న సమస్యలను, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల్లో మమేకమై ఉంటూ వీరందరూ కూడా ఏకతాటిపై కలిసికట్టుగా ఉండాలని వారికి వివరించారు,
గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించి ఉప సర్పంచ్ భవాని నాగులు గారితో కలిసి ఊరిలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎల్లవేళలా మేమున్నామని చెబుతూ గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ లోటు వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా మీతో పాటు నేనున్నానని, ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి హామీని నిలబెట్టుకుంటానని, గ్రామంలో నెలకొక్కసారి గ్రామసభలు నిర్వహించి, గ్రామంలోని ప్రతి సమస్యపై దృష్టి సారించి వాటిని సకాలంలో పూర్తి చేస్తానని ప్రమాణం చేయడం జరిగింది,
గ్రామంలోని వార్డు మెంబర్స్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, కావిటి అశోక్, జంగిటి అంజమ్మ, బిచ్చగాని ముత్యాలు, కుమ్మరి శిరీష, పైసా నవీన్, లింగంపేట జైపాల్, శెట్టి రాజు, నవాజ్ రెడ్డి, మాసాని లావణ్య, మరియు గ్రామ పెద్దలు యువకులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.