తేది:22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS హవేలి ఘన్పూర్ మండలం రిపోర్టర్ జండాకాడి సందీప్ గౌడ్.
మెదక్ జిల్లా:హవేలి ఘన్పూర్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామ పంచాయతీలో ఇటీవల ఎన్నికైన నూతన పాలకవర్గం సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుర్మ హేమలత సమక్షంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు తమ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.
గ్రామ సర్పంచ్‌గా లింగాల భూదేవి, ఉపసర్పంచ్‌గా గూడ్డీ నోళ్ళ రేఖమయ్య ప్రమాణ స్వీకారం చేయగా, నూతన పాలకవర్గం గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, త్రాగునీటి సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తామని నాయకత్వం హామీ ఇచ్చింది.
వార్డు సభ్యులు:
1వ వార్డు – తొగిట సత్యనారయణ
2వ వార్డు – మన్నె అనల్ప
3వ వార్డు – విరప్పగారి (సెందిల) వెంకట్ గౌడ్
4వ వార్డు – దూర్గారి శ్యామల
5వ వార్డు – లింగంపల్లి శ్రీనివాస్
6వ వార్డు – మన్నె శోభ
7వ వార్డు – సాతెలి శ్రీనివాస్
8వ వార్డు – లింగాల సంతోష్
9వ వార్డు – మంగలి చంద్రవ్వ
10వ వార్డు – గూడ్డీ నోళ్ళ రేఖమయ్య,
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కూచన్‌పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా పనిచేస్తామని నూతన నాయకత్వం వెల్లడించింది.