
తేది:22-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
శంషాబాద్: నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న KLM–873 విమానానికి సంబంధించి బాంబు ఉందని బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు, పైలట్ సూచనల మేరకు విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అనంతరం విమానంలోని ప్రయాణికులను కిందికి దింపి, భద్రతా చర్యలలో భాగంగా ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు.
ప్రస్తుతం విమానాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు మరియు భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు.