తేది:22-12-2025 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూర్ మండల రిపోర్టర్ ఎండి బురహానుద్దీన్.
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
సర్పంచ్ గా బొడ్డు రోజా లక్ష్మి, ఉపసర్పంచ్ గా పలగాని శ్రీనివాసరావు తో పాటు మరో 9 మంది వార్డు మెంబర్లు ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు.నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
అనంతరం కాకర్లపల్లి సొసైటీ చైర్మన్ తుమ్మూరి ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ రోజా లక్ష్మి మాట్లాడుతూ గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.ముఖ్యంగా కోతులు,కుక్కల బెడద లేకుండా చూస్తానని,గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటానని,శిధిలావస్థలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ ను బాగు చేయించి గ్రామస్తులు అందరికీ ఉచితంగా మినరల్ వాటర్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడకుండా బిఆర్ఎస్ పార్టీని ఆదరించి సర్పంచ్ తో పాటు పదికి పది వార్డులను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు అలానే ఎమ్మెల్సీ సహకారంతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.జిల్లాలోనే బుగ్గపాడు గ్రామంలో అత్యధిక మెజారిటీతో సభ్యులు గెలుపొందారని ఆనందం వ్యక్తం చేశారు.