రెండేళ్ల కాలంలో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, రేజర్ల కంటే అంతకంటేవెంసూరు కు ఎక్కువ శాతం నిధులు మంజూరు చేయించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయిస్తా, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్.

తేది:22-12-2025 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూర్ మండల రిపోర్టర్ ఎండి.బురహానుద్దీన్.

ఖమ్మం జిల్లా: మండల కేంద్రమైన వేంసూరు లో నూతన సర్పంచ్ మహమ్మద్ ఫక్రుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసనసభ్యురాలు. డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్, మరియు సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేంసూరు పంచాయతీకి యువకుడు ఉత్సాహ వంతుడు మంచి వ్యక్తి సర్పంచ్ గా ఎన్నిక అవడం హర్షణీయమని, ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలుపుతూ రెండు సంవత్సరాల కాలంలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని, రేజర్ల కంటే, అంతకంటే వెంసూరు పంచాయతీని ఎటువంటి సమస్యలు ఉన్న వాటిని త్వరతిగతిన పరిష్కరించే విధంగా చూస్తానని, ఎక్కువ శాతం నిధులు మంజూరు చేయించి గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని ఆమె అన్నారు.
వెంసూరు సర్పంచ్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించిన పంచాయతీ కార్యదర్శి కిషోర్ బాబు
అందరి దీవెనలు, ఆశిస్సులు తో, పెద్దల సహకారంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఫక్రుద్దీన్ అన్నారు.
మన గ్రామానికి ప్రధానంగా కోతులబెండద ఎక్కువగా ఉంద ని, గ్రామపంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉందని డ్రైనేజీలు నిర్మింపచేయాలని, గ్రామపంచాయతీ కు మంజూరు కాబడిన నిధులను దుర్వినియోగం చేయకుండా గ్రామపంచాయతీకి, మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు వినియోగించాలని వక్తలు సర్పంచ్ ఫక్రుద్దీన్ ను కోరారు.
అందరి మన్ననలు పొంది ప్రజా ఆశీస్సులతో అంచలవారు ఎదిగి గ్రామ సర్పంచ్ గా నేడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్పంచ్ ఫక్రుద్దీన్చినవాడైన పెద్ద మనసుతో గ్రామపంచాయతీలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని, తన వంతు కర్తవంగా, కరోనా కష్టకాలంలో పేద ప్రజల్ని ఆసుపత్రికి తీసుకువెళ్లి స్వంత ఖర్చులతో వారిని ఆరోగ్య వంతులుగా చేసి ఎంతోమందికి సేవలు చేశారని కొనియాడారు. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వారిని ఆదుకోవడంలో వెనుకడుగు వేయకుండా, వారికి భరోసా కల్పించి వారి పనే అయ్యేవరకు నిద్రపోవడానికి వక్తలు పేర్కొన్నారు. ముందు ముందు సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రతిష్టాలు సంపాదించాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్. ఈడ ఏడుకొండలు, వార్డు సభ్యులు శ్రీమతి కన్నే ర.శ్రావణి, షేక్ రహీం, కంచర్ల వెంకటేశ్వరావు, షేక్ నసీమా, యాకూబ్, గొల్లమూడి లక్ష్మి, కొమ్మనేపల్లి రజిని, కొట్టే ప్రమీల, మరకంటి తిరుపతిరావు, పిల్లి. వెంకటరమణ, కార్యదర్శి. ఎం కిషోర్ బాబు, మాజీ సర్పంచ్ అశోక్ కుమార్, షేక్ అక్బర్, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు. బొంతు భాస్కరరావు, మోటపోతుల జగన్నాథం, యువకులు గ్రామ ప్రజలు విరివిగా, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *