

తేది:22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గ్ మండల్ రిపోర్టర్ వడ్ల పాపయ్య.
మెదక్ జిల్లా, అల్లాదుర్గ్: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలలో కోలాహలంగా ముగిసాయి. అల్లాదుర్గం మండలంలో 16 గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు వార్డు మెంబర్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామపంచాయతీలో ఒకేరోజు ప్రమాణ శ్రీకారం చేయాలని సదుద్దేశంతో సోమవారం గ్రామపంచాయతీలు కొత్త రంగులతో విద్యుత్ దీపాలతో అలంకరించి సర్పంచులు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం కోలాహాలంగా గ్రామాలలో పండుగ వాతావరణం లో ప్రమాణ స్వీకారం ఎంపీడీవో పేద ప్రకాశ్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అల్లాదుర్గం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మద్దూరి సౌమ్య, ఉపసర్పంచ్ పాండు, వార్డు మెంబర్లు పంచాయతి సెక్రటరీ ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం గ్రామాలలో పండుగ వాతావరణం సంతరించుకున్నాయి సర్పంచులు తొలి బాద్యతలు చిరస్మరణీయంగా మార్చుకోవాలని గ్రామాలలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సాయి శక్తుల గ్రామాల అభివృద్ధి కొరకు కృషి చేస్తామన్నారు. ఆయా గ్రామాలలో పంచాయతీ కార్యాలయాలకు ప్రమాణస్వీకారంతో సందడిగా నెలకొంది గెలిచిన వారంతా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయడానికి ఆకాంక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలలో ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.