
తేది: 22-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత నిచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ,అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మజ రాణిలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని నలు మూలల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులను కలెక్టర్ కు అందజేశారు.
ఆర్జీదారుల నుండి వినతులు స్వీకరిస్తూ,వారితో మాట్లాడి సమస్యలను తెలుసు
కున్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు పరిశీలించి
తక్షణ చర్యలు
తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత చొరవ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వివిధ సమస్యలపై వచ్చిన వినతులను జాగ్రత్తగా పరిశీలించి, పరిష్కరించ
గలిగిన వాటిని వెంటనే పరిష్కరించాలని తెలిపారు.
ప్రజావాణిలో మొత్తం 17 అర్జీలు రాగా, వాటిని సంబంధిత శాఖలకు తగిన చర్యలకు పంపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈ ఓ జానకి రెడ్డి, పి డి, డి ఆర్ డి ఓ జ్యోతి,ఆర్డీవోలు, రెవెన్యూ, పోలీస్,పంచాయతీ రాజ్, వ్యవసాయం, విద్య,హౌసింగ్, వైద్య,ఆరోగ్యం, ఇంజనీరింగ్, సంక్షేమ శాఖల జిల్లా
అధికారులు, మున్సిపల్ కమిషనర్లు,తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.