
తేది: 22-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్.
సంగారెడ్డి మున్సిపాలిటీ శాంతినగర్, గణితం ప్రత్యక్షంగా చూస్తే కాస్త కష్టం అనిపిస్తుంది , చేసి చూసేకొద్ది బాగా అర్థమవుతుంది .లెక్కలు రావడం కష్టమని భయపడకు ,చూసి నేర్చుకుంటే గణితం సులువు అవుతుంది.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్138వ జన్మదినమైన ఆగస్టు 22 ను జాతీయగణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలోని స్థానిక సంగారెడ్డి లోని శాంతినగర్ లో గల సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల డైరెక్టర్ గౌరవ శ్రీ ఈ.విజయకుమార్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఈ. అరుణ రెడ్డి ,అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గౌరవ శ్రీ ఈ. జయపాల్ రెడ్డి పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గౌరవ శ్రీ ప్రదీప్ లక్కిశెట్టి మరియు గణితోపాధ్యాయులు, శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలనుగావించి ,పటాన్ని పూలమాలతో అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం గణితం యొక్క గొప్పదానాన్ని ఉపాధ్యాయులు ప్రసంగించగా ,విద్యార్థులు వివిధ స్కిక్ట్ల ద్వార అందరికి అర్థమయ్యే విధంగా ప్రదర్శించారు.చివరగా మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల డైరక్టర్ గారు ప్రశంసాపత్రాలను అందించి , చిన్నారులను ప్రశంసించారు.
ఇట్టి ఈ కార్యక్రమం సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల ఫౌండర్ మరియు చైర్మన్ గౌరవ శ్రీ ఈ.సలోమోన్ రెడ్డి గారి దివ్య ఆశీస్సులతో కొనసాగింది. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.