తేది:22-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా స్థాయి బహుళ సభ్యుల అధికారిక సమావేశం
ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం, 1994
మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సమావేశం బి. రాజా గౌడ్ అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించారని తెలిపారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో అనే విస్తృతమైన ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా అవగాహన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. గర్భవతిగా నమోదు అయినప్పటి నుండే ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కౌన్సిలింగ్ చేయవలెనని తెలిపారు. జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో దరఖాస్తు చేసుకున్నటువంటి మూడు నూతన స్కానింగ్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ మరియు 1 రెన్యువల్ సెంటర్స్ కు అనుమతి ఇచ్చే విషయం గురించి కలెక్టర్కు నివేదించడం జరిగిందనీ తెలిపారు. కమిషనర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గారి ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నిబంధనలు అతిక్రమించిన మూడు స్కానింగ్ సెంటర్లకు జరిమానా విధించడం మరియు హెచ్చరిక నోటీసులు జారీ చేయడం గురించి వివరించారు. మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ కోసం అమలవుతున్న నియమ నిబంధనలను కమిటీతో చర్చించారు. ప్రతినెల ఫారం – ఎఫ్ మరియు ఆన్లైన్ పోర్టల్ లో పొందు పరుచడం, 5వ తారీఖు లోపల వారికి కేటాయించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కార్యాలయంలో సమర్పించవలెనని సూచించారు.
ప్రస్తుతం జిల్లాలో 80 స్కానింగ్ సెంటర్స్ అనుమతి పొంది ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ సుధీర్ ,హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్ , తరాల శంకర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం , పర్యవేక్షకులు కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.