
తేది:21-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా:జాతీయ లోక్ అదాలత్
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA), సంగారెడ్డి ఆధ్వర్యంలో, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (TSLSA) మార్గదర్శకాల మేరకు 21 డిసెంబర్ 2025 (ఆదివారం) న సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గారు తెలిపారు.
ఈ జాతీయ లోక్ అదాలత్‌కు ముఖ్య అతిథిగా శ్రీమతి.కె. జయంతి గారు,
మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి, సంగారెడ్డి
హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం నందు న్యాయమూర్తి గారు మాట్లాడుతు,జాతీయ లోక్ అదాలత్ ఉద్దేశాలు అనగా
• ప్రజలకు సులభమైన, వేగవంతమైన న్యాయం అందించడం
• కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడం
• పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా వివాద పరిష్కారం చేయించడం
• ఖర్చు మరియు సమయాన్ని ఆదా చేయడం.
లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి ఎలాంటి కోర్టు ఫీజు ఉండదు.
పెండింగ్ కేసులు పరిష్కారమైతే చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి చెల్లించబడుతుంది.
లోక్ అదాలత్ అవార్డు సివిల్ కోర్టు డిక్రీగా పరిగణించబడుతుంది.
లోక్ అదాలత్ అవార్డు తుది నిర్ణయంగా ఉంటుంది; అప్పీల్ అవకాశం ఉండదు అని తేలిపారు.రాజీ చేయదగ్గ పోలీస్ కేసులు, భార్యాభర్తల చిన్నచిన్న వివాదాలు, ఎక్సైజ్ కేసులు, బ్యాంక్ కేసులు తదితర కేసులు రాజీ చేయదగ్గ కేసులలో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవచ్చు అన్నారు.క్షణికావేశంలో ఇరువర్గాలు చిన్న చిన్న తగాదాలు పడి కేసులు నమోదు జరిగి కోర్టు చుట్టూ తిరుగుతూ తమ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా కోర్టులో తమ తమ పై ఉన్నటువంటి కేసులను రాజీచేసుకుని సామరస్యంగా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి అన్నారు.ఈ లోక్ అదాలత్ నందు పరిష్కరించబడిన కేసుల వివరాలు క్రింద ఉన్నాయి.
1.క్రిమినల్ కాంపౌండేల్ కేసులు – 3635
2.సివిల్ కేసులు – 39
3.మోటారు వాహన ప్రమాద పరిహారం కేసులు – 19,Rs.1,31,20000/-
4.బ్యాంకు రికవరి కేసులు – 534
5.సైబర్ క్రైమ్ కేసులు -21
మొత్తం కేసులు – 4248
శ్రీమతి కే జయంతి గారు,జిల్లా మొదటి అదనపు సెషన్ జడ్జి సంగారెడ్డి
శ్రీ.DVR తేజో కార్తీక్ గారు ,ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి సంగారెడ్డి శ్రీమతి.బి.సౌజన్య గారు ,జిల్లా ప్రధాన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
శ్రీమతి.ఆర్. అనిత గారు ,ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, సంగారెడ్డి
శ్రీమతి కె.ధన లక్ష్మి గారు, అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, సంగారెడ్డి.
శ్రీమతి టి. దుర్గా రాణి, ప్రత్యేక మొబైల్ కోర్టు న్యాయమూర్తి, సంగారెడ్డి కోర్ట్ సిబ్బంది, అడ్వకేట్లు,పోలీసులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.