


తేదీ:20-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్.నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం లోగల, జిల్లా ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాల దగ్గర రోడ్డు పై రాళ్లు, తోపుడు బండ్లు ఇష్టాను సారంగా పెట్టుచున్నారు అంతే కాకుండా పాఠశాల చుట్టు ఉన్న ప్రహరీ గోడ సగం కూలీ పోయినది ఈ విషయం ఆ యొక్క వార్డు కౌన్సిలర్ గాని ఉన్నత అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. కొందరు అయితే అక్కడే చెత్త చెదారం వేస్తున్నారు, అదే రోడ్డు పై పెద్ద సిమెంట్ రాయికూడా ఉంది. ఇట్టి ఇబ్బందుల వల్ల ప్రజలు, పాఠశాల విద్యార్థినీలు అవస్థతకు గురి అవుతున్నారు. కావున మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఉన్న రాళ్ళ కుప్పలను రోడ్డు పై ఉన్న సిమెంట్ పెద్ద రాయి బండను వెంటనే తొలగించి పాఠశాల విధ్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుడాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్టి విషయంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చట్టాన్ని అనుసరించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు.