
తేది:20-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా శెట్టిపల్లి గ్రామంలో ఎస్సీ వార్డు నుంచి ఒకటో వార్డ్ మెంబర్‌గా ఎన్నికై, అనంతరం 74 ఓట్ల మెజారిటీతో ఉప సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన భవాని నాగులు గారికి కుటుంబ సభ్యులు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా భవాని నాగులు గారి సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, బంధుమిత్రులు శాలువా మరియు పూలదండలతో సత్కరించి హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొము కిరణ్, కొమ్ము షేకులు, ధర్మసాగర్ దుర్గయ్య,పోడ్చన్ పల్లి దాసు, పద్మారావు, జనార్ధన్, చిన్న యేసు, కుమార్, యాదగిరి, శివలింగం ఎల్లం, దాసు, అమృతి, పెద్ద యేసు, దుర్గయ్య, దావీదు, జాను, వల్లూరు దాసు, యోబు, యేసు, దుర్గేష్, త్రిశ్వంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.