తేది:20-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, సివిల్ వివాదాలు తదితర అంశాలను పరస్పర అంగీకారంతో సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం, న్యాయ సేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ జాతీయ లోక్ అదాలత్ ప్రజలకు తక్షణ న్యాయం అందించే శాంతియుత పరిష్కార వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా ఇరు పక్షాలు పరస్పర సమ్మతితో సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.