

తేది:20-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: శనివారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ, లోహియ ఆయిల్ పామ్ కంపనీ, మైక్రో ఇరిగేషన్ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఫిబ్రవరి మాసం వరకు వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశాలు జారీచేయడం జరిగినది.
ఈసందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ:
ఫ్యాక్టరీ ఏర్పాటు పై రైతులకు ఎలాంటి అపోహ వద్దని, గెలల కోత ప్రారంభమైనప్పటి నుండి ప్రతి మండల కేంద్రములో గెలల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉద్యాన శాఖ, లోహియా కంపనీ సమన్వయముతో రైతుల వద్ద నుండి ప్రభుత్వం నిర్దారించిన రేటుకి గెలలు కొనుగోలు చేస్తామని మరియు 10 రోజులలో రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేయబడునని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమములో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్, జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఏ డి ఏ లు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, వ్యవసాయ, ఉద్యాన విస్తీర్ణ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల సీ ఈ ఓ లు, లోహియా కంపనీ జనరల్ మేనేజర్, క్షేత్ర సిబ్బంది మరియు డ్రిప్ సిబ్బంది పాల్గొన్నారు.