

తేది:20-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల పై రాష్ట్ర రవాణా శాఖ ఆద్వర్యంలో రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సి.ఎస్ రామకృష్ణ రావు, స్పెషల్ సి.ఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.
శనివారం జగిత్యాల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ:
వాహనాలు నడిపే వారు విధిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు రవాణాశాఖ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు.
ట్రాఫిక్ రూల్స్ చాలా మంది పాటించడంలేదన్నారు. ద్విచక్రవాహనం నడిపేటపుడు హెల్మెట్, కారు నడిపేటపుడు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ప్రయాణ సమయంలో చేసే చిన్న పొరపాటు వల్ల మీతోపాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. అందువల్ల తాము రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల క్యాలెండర్ రూపొందించాలని తెలిపారు. నెలకు ఒక్కసారి వివిద రకాల కార్యక్రమాలు నిర్వహించాలని ఇట్టి కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ఆర్టిసి, ఎడ్యుకేషన్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, లతో పాటు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి రోడ్డు ప్రమాదలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు తద్వారా భవిష్యత్తులో వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాల కొరకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించాలని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామంలో యాక్షన్ ప్లాన్ తో IAS, IPS మరియు జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాల్లో ప్రతి నెల రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి నివేదికలు ఉన్నత అధికారులకు అందించాలని సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు మాట్లాడుతూ:
దేశంలో ప్రతి యేట వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని తెలిపారు. ప్రతిరోజు 20 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
ఆస్థి నష్టం, ప్రాణ నష్టాలను నివారించాలంటే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదల వల్ల కుటుంబాలు చిన్నా-భిన్నo అవుతాయని తెలిపారు. కేంద్ర ప్రభత్వం ప్రమాదంలో మృతి చెందిన వారికి 1,50,000/- రూపాయలు 8 రోజుల్లోగా అందిస్తుందని, ప్రమాదంలో ఉన్నవారిని ఆసుపత్రి లో చేర్పించినట్లైతే 25000/- రూపాయలు అందిస్తుందని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదలకు గల కారణాలను గుర్తించాలని సూచించారు.
డ్రైవర్లకు తగిన విశ్రాంతిని ఇవ్వాలని తద్వారా ప్రమాదాలను కొంతమేరకు నివారించవచ్చని తెలిపారు. నేషనల్ హైవే ల పక్కన ఉండే గ్రామాల ప్రజలు రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తగా దాటాలని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులకు రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. రహదారులపై సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనవరి 2026 చేపట్టనున్న రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహణకు శాఖల వారిగా కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.