
తేదీ:20-12-20 25TSLAWNEWS సదాశివపేట మండలం కోఆర్డినేటర్ మన్నే మల్లేశం.
సంగారెడ్డి జిల్లా: శనివారం రోజున సదాశివపేట పట్టణంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పిల్లల భద్రత. మరియు భద్రత అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ వెంకటేశ్వర్లు జిల్లా విద్యాధికారి హాజరై మాట్లాడుతూ. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చిన్న వయసు నుంచి సరైన అవగాహన కల్పిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిల్లలకు రహదారి భద్రత ఇంటి వద్ద భద్రత అపరిచితుల నుంచి జాగ్రత్తలు. సైబర్ భద్రత అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన చర్యలు వంటి ముఖ్య అంశాలపై అవగాహన కల్పించే బడింది. నిపుణుల ద్వారా ఇచ్చిన సూచనలు ప్రదర్శనలు మరియు పరస్పర చర్యల ద్వారా పిల్లలు ఆసక్తిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు భద్రతపై అవగాహన పెంచుకోవడంతో పాటు. ఆచరణాత్మక జ్ఞానం పొందాలని ఎస్సై కృష్ణయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్ ఎం. జయసుధ. డి సి పి ఓ రత్నయ్య. ఓ ఎస్ సి అవగాహన ఆఫీసర్ కల్పన. సఖి ప్రోగ్రాం ఇంచార్జ్ భానుప్రియ. ఐ సి డి ఏ సూపర్వైజర్ మాలవ్య. పాఠశాల టీచర్స్ సీఆర్పీలు రాజేశ్వర్. సరస్వతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.