తేది:20-12-2025 TSLAWNEWS నిజాంబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జ్ కేశపురం సుమన్.
వేల్పూర్ : వేల్పూర్ మండలం పచ్చల నడుకూడ గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కొల్లే నర్సయ్య ఈరోజు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతు గ్రామ అభివృద్దే లక్ష్యంగా అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు.బీఆర్ఎస్ కుటుంబంలోకి వచ్చిన సర్పంచ్ కొల్లే నర్సయ్య మరియు సంఘ సభ్యులకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.