బడుగుల లీడర్ కొర్వి కృష్ణ స్వామి వర్ధంతి స్మరించుకుంటూ కలిసికట్టుగా బలపడుదాం-D. క్రిష్ణ ముదిరాజ్ కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు.

తేది:19-12-2025 TSLAWNEWS సదాశివపేట మండల కోఆర్డినేటర్ మన్నె మల్లేశం.

ఆ వీరుడు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు,పాత్రికేయుడు,రచయిత, విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశీలి.

మహనీయుడి కృషితోనే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఏర్పడింది.యన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం, కలిసికట్టుగా ముందుకు కదిలి బలపడదాం-D. క్రిష్ణ ముదిరాజ్.

సంగారెడ్డి జిల్లా:సదాశివపేట మండలం బీసీ సెల్ అధ్యక్షులు శుక్రవారం కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ వర్ధంతి పురస్కరించుకొని మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
హైదరాబాద్ నగర మేయర్ గా పని చేసి ఆయన ముందుచూపుతో చేసిన నగర మాస్టర్ ప్లాన్ చిరస్థాయిగా నిలిచిపోయింది అని కాంగ్రెస్ పార్టీ సదాశివపేట మండల్ బీసీ సెల్ అధ్యక్షులు డి కృష్ణ గారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగుల ముద్దుబిడ్డ మహానేత కొర్వి కృష్ణస్వామి అని, ఆయన ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి అని ఆయన బహుజనుల పక్షాన ఉండి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశాడన్నారు. ఆ మహానేత ఆశయాలను ఆయన స్ఫూర్తితో మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్దాం అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *