రణ్‌వీర్ సింగ్ మరియు దర్శకుడు ఆదిత్య ధార్ కలయికలో వచ్చిన ‘ధురంధర్’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 285 కోట్లు వెచ్చించింది. ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ‘పుష్ప 2: ది రూల్’ (దాదాపు రూ. 275 కోట్లు) పేరిట ఉన్న ఆల్ టైమ్ హైయెస్ట్ ఓటీటీ డీల్ రికార్డును ఈ చిత్రం అధిగమించి, హిందీ చిత్రాల్లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ. 1000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. ఈ చిత్రం థియేటర్లలో భారీ స్పందన పొందుతుండటంతో, ఓటీటీలో కూడా అదే స్థాయి వ్యూయర్ షిప్ వస్తుందని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఒప్పందం ప్రకారం, థియేటర్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాత, అంటే 2026 జనవరి 30 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
మరో విశేషమేమిటంటే, ఈ సినిమా సీక్వెల్ ‘ధురంధర్ 2: రివెంజ్’ ఇప్పటికే సిద్ధమైంది. దీనిని 2026 మార్చి 19న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా వంటి భారీ తారాగణం ఉండటం మరియు ఆదిత్య ధార్ అద్భుతమైన మేకింగ్ సినిమాకు ఈ స్థాయి క్రేజ్ తీసుకువచ్చాయి. ఈ ఓటీటీ డీల్ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే అతిపెద్దది కావడం విశేషం.