తేది:19-12-2025 TSLAWNEWS మెదక్ రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్:కరుణామయుడు, లోక రక్షకుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా, పండుగ ముందురోజుల నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకలకు మెదక్ పట్టణంలోని 27వ వార్డ్ గోల్కొండ వీధిలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ పట్టణ 27వ వార్డ్ గోల్కొండ గాయిని ఇంచార్జ్ చిన్నారోళ్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరీ సోదరీమణులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, శాంతి, మానవత్వ సందేశాన్ని ప్రపంచానికి అందించిన యేసునాధుని కృప అందరిపై ఉండాలని ప్రార్థించారు.
సెమీ క్రిస్మస్ వేడుకలు సంతోషంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని పేర్కొంటూ, అందులో భాగంగా గోల్కొండ వీధి శుభ్రత పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ దాసుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.