

తేదీ:19-12-2025 TSLAWNEWS పటాన్చెరు మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
పటాన్చెరు:మహిళ ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి
పటాన్చెరు మార్కెట్ రోడ్డు ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన ఈ మహిళ మృతదేహాన్ని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మార్కెట్ రోడ్డులోని ఒక షాపు ముందు పడుకోబెట్టి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో, ఈ మహిళ ఏదో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని ఇక్కడ వదిలి వెళ్లినట్టుగా సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పటాన్చెరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళకు సంబంధించిన ఆధారాలు, గుర్తింపు వివరాలు ప్రస్తుతం తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
ఈ మహిళను ఎవరికైనా గుర్తుపడితే లేదా ఆమెకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే, వెంటనే పటాన్చెరు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
📞 సంప్రదించవలసిన నంబర్: 8712581496