ప్రజల న్యాయ పోరాటానికి అండగా – TSLAWNEWS.

తేది:19-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా:మెదక్ పట్టణంలో గురువారం నాడు TSLAWNEWS ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా TSLAWNEWS ఎడిటర్, ప్రొప్రైటర్, హైకోర్టు అడ్వకేట్ శ్రీ కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. TSLAWNEWS మెదక్ జిల్లా చీఫ్ అడ్వైజర్ నాగులూరి స్వామిదాస్ గారు, జిల్లా ఇన్‌చార్జ్ గొల్లపల్లి సాయిగౌడ్ గారు, జిల్లా రిపోర్టర్లు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ న్యాయవాది శ్రీ కోవూరి సత్యనారాయణ గౌడ్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. యువతకు న్యాయ రంగంలో మార్గదర్శనం చేస్తూ, న్యాయ సలహాల ద్వారా అవకాశాలు కల్పించడం, సామాన్య ప్రజలకు న్యాయ సమస్యల్లో అండగా నిలుస్తూ కేసుల పరిష్కారానికి సహకరిస్తున్న ఆయన సేవలను కొనియాడారు.
అదేవిధంగా, మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్‌ను నిరంతర ప్రజా సమస్యల కవరేజ్, నిష్పక్షపాత రిపోర్టింగ్, బాధ్యతాయుత పాత్రికేయతకు గుర్తింపుగా ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. స్థానిక సమస్యలను సమయానుకూలంగా వెలుగులోకి తీసుకువచ్చి ప్రజల గొంతుకగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
ఈ సందర్భంగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ, ప్రజలకు న్యాయ అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర కీలకమని, బాధ్యతాయుత పాత్రికేయతతో పాటు సమాజానికి న్యాయం చేరేలా TSLAWNEWS నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవ, న్యాయం, యువత సాధికారతే లక్ష్యంగా TSLAWNEWS ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *