
తేది:19-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్ జిల్లా:రువారం నాడు TSLAWNEWS సంపాదకులు, యజమాని, హైకోర్టు అడ్వకేట్ శ్రీ కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు, TSLAWNEWS మెదక్ జిల్లా చీఫ్ అడ్వైజర్ నాగులూరి స్వామీ దాస్ గారు, జిల్లా ఇన్‌చార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్, అలాగే రిపోర్టర్లు సందీప్ గౌడ్, ఎల్లం, సమయ్య గారు కలిసి మెదక్ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఎస్. మహేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో చట్ట వ్యవస్థ, ప్రజల్లో అవగాహన పెంపు, సమాజ బలోపేతంలో బాధ్యతాయుత జర్నలిజం పాత్ర వంటి అంశాలపై చర్చించారు. వాస్తవాల ఆధారంగా వార్తా ప్రసారం చేస్తూ ప్రజలతో సానుకూలంగా మమేకమవుతున్న TSLAWNEWS పాత్రను అదనపు ఎస్పీ అభినందించారు. జిల్లావాసుల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ పోలీస్ శాఖ–మీడియా మధ్య సమన్వయం కొనసాగాలని ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది.