తేది:19-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
హనుమకొండ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని TMSRU వరంగల్ సెక్రటరీ సుధీర్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్రం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ యాక్ట్ 1976ను పునరుద్ధరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్క చట్టబద్ధమైన పని పద్ధతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని హన్మకొండ కలెక్టరేట్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ సుధీర్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ మాట్లాడుతూ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. వీరి పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ మాట్లాడుతూ వైద్య ప్రతినిధుల హక్కులను కాపాడాలని, అనవసరమైన వేదింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలు వైద్యప్రతినిధుల జీవనాధారంపై ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పిఈ యాక్ట్ పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
అభివాదం తెలుపుతున్న నాయకులు,
రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
సతీష్ కుమార్ మరియు నరేష్
జిల్లా కార్యదర్శి వి.సుధీర్
ఉపాధ్యక్షులు వెంకటేష్ మరియు భాస్కర్
సహాయ కార్యదర్శులు రాజ్కుమార్ మరియు కృష్ణ
కోశాధికారి వినయ్.