
తేది:19-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
టీఎస్ లా న్యూస్ జర్నలిస్టుల సేవలను సద్వినియోగం చేసుకోని, ప్రజా సమస్యలను పరిష్కరించుకోండి- ప్రముఖ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్
మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా
సమస్యల పరిష్కారం కోసం చట్ట
పరంగా ప్రజలకు సేవలందిస్తున్న టీ ఎస్ లా న్యూస్ చానెల్ ఎడిటర్, యాజమాన్యం కోవూరి సత్యనారాయణ గౌడ్ తో మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ గురువారం సమావేశం అయ్యారు. మెదక్ జిల్లాలోని అన్ని మండలాల్లో జిల్లా బార్ అసోసియేషన్ తరుపున చట్ట పరమైన న్యాయ సలహాల కోసం అడ్వకేట్స్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.
ప్రజలకు వారి హక్కుల గురించి, చట్టాల గురించి న్యాయవ్యవస్థ గురించి, అవగాహన కలిగించేందుకు తోడ్పాటు పడుతాం అన్నారు. ఒక వ్యక్తికి ఒక సమస్య ఎదురైనప్పుడు అతడు ఆ సమస్యను తీసుకుని ఏ అధికారి దగ్గరకు వెళ్లాలి ఏ విధంగా , ఫిర్యాదు చేయాలి. కోర్టుకు వెళ్లవలసి నటువంటి సమస్యల్లో ఏ కోర్టుకు వెళ్లాలి, ఎంత కోర్టు ఫీజు కట్టాలా అనే వివరాలు తెలియజేస్తాం అన్నారు. అదే విధముగా మహిళలకు, దళితులకు, ఆదివాసులకు, ఉన్న ప్రత్యేకమైన హక్కులు ఏమిటి, వారికి ప్రభుత్వం ద్వారా ఎటువంటి న్యాయ సహాయం అందుతుంది, న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి.ప్రజలకు ఉండేటటువంటి ప్రాథమిక హక్కులు మరియు మానవ హక్కుల గురించి చర్చించారు.
ప్రమాదానికి/ భూమిని కోల్పోయిన వారికి ఎటువంటి నష్టపరిహారము దొరుకుతుందో తెలియజేస్తుందని,
మానవ మనుగడకు, జీవరాశి మనుగడకు ఎటువంటి భంగము కలిగించేటటువంటి సమస్యల యొక్క పరిష్కారము కొరకు నిరంతరము పనిచేస్తుంది అని తెలిపారు.రాజ్యాంగం పట్ల పరిపూర్ణమైన అవగాహనను కలిగిస్తుంది అని తెలిపారు. అదేవిధంగా టీఎస్ లా న్యూస్ మెదక్ జిల్లా చీఫ్ అడ్వైజర్ నగులూరి స్వామి దాస్, మెదక్ జిల్లా ఇన్చార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్, టీఎస్ లా న్యూస్ నిబంధనల ప్రకారం జర్నలిస్ట్‌లను సరైన సరళిలో ముందుకు నడిపిస్తూ మెదక్ జిల్లా యొక్క పూర్తి బాధ్యతలు వహిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, పరిష్కరించే విధంగా చట్టపరిధిలో ముందుకు కొనసాగుతారని తెలియజేశారు. ఈ యొక్క సమావేశంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు మరియు టీఎస్ లా న్యూస్ జర్నలిస్టులు పాల్గొన్నారు.