

తేదీ:18-12-2025, జనగామ జిల్లా,TSLAWNEWS , మండల రిపోర్టర్, Maroju Bhaasker
జనగామ జిల్లా: పాలకుర్తి మండలం ముత్తారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏడో వార్డులో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ ఓటర్ జాబితాలో మునెమ్మ గ్యార (భర్త: ఎల్లయ్య) అనే ఓటరు పేరు ఏడో వార్డు, ఎనిమిదో వార్డు రెండింటిలో నమోదై ఉండటంతో ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలింగ్ రోజు 17-12-2025న ఉదయం ఎనిమిదో వార్డులో ఓటు వేసిన మునెమ్మ గ్యార, ఓటింగ్ చివరి దశలో ఏడో వార్డులో కూడా ఓటు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియలో ఏడో వార్డులో గౌను గుర్తు అభ్యర్థికి 99 ఓట్లు, స్టూలు గుర్తు అభ్యర్థికి 100 ఓట్లు రావడంతో గౌను గుర్తు అభ్యర్థి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యాడు.కౌంటింగ్ అనంతరం పరిస్థితిని గమనించిన గౌను గుర్తు అభ్యర్థి, అదే ఓటరు ఏడో వార్డు మరియు ఎనిమిదో వార్డుల్లో ఓటు వేసిన కారణంగానే తాను ఒక్క ఓటుతో ఓడిపోయానని గుర్తించాడు. వెంటనే అక్కడే ఉన్న రిటర్నింగ్ అధికారికి జరిగిన రిగ్గింగ్ విధానాన్ని వివరించాడు.దీనిపై స్పందించిన రిటర్నింగ్ అధికారి ఏడో మరియు ఎనిమిదో వార్డుల పోలింగ్ పత్రాలను పునఃపరిశీలించగా, నిజంగానే మునెమ్మ గ్యార రెండు వార్డుల్లో ఓటు వేసినట్లు నిర్ధారణైంది. న్యాయం చేయాలని గౌను గుర్తు అభ్యర్థి అధికారులను వేడుకున్నాడు.ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి పాలకుర్తి మండల ఎంపీడీవో కి తెలియజేయగా, రిగ్గింగ్‌కు పాల్పడిన వ్యక్తి ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో వేదవతి స్పష్టం చేశారు. గౌను గుర్తు అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఎంపీడీవో , దానిని కలెక్టర్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాలతో ముత్తారం గ్రామంలో ఏడో వార్డు ఎన్నికల ఫలితంపై సందిగ్ధత నెలకొంది.
రిగ్గింగ్ చేసిన వ్యక్తి వివరాలు:
పేరు : మునెమ్మ గ్యార
భర్త పేరు : ఎల్లయ్య
ఎపిక్ నంబర్ (ఎనిమిదో వార్డు) : ZFY2459220
ఎపిక్ నంబర్ (ఏడో వార్డు) : ZFY1771658