

తేది:18-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అడిషనల్ కలెక్టర్ బి రాజా గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన- డాక్టర్ ఆకుల శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి డా ఆకుల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. తదుపరి అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అడిషనల్ కలెక్టర్ బి రాజా గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గురువారం రోజున జగిత్యాల జిల్లా నూతన వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా డా ఆకుల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా వైద్యాధికారిగా పనిచేసిన డా కె ప్రమోద్ కుమార్ డిప్యూటేషన్ పై పెద్దపెల్లి జిల్లాకు వెళ్ళారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డా ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించేలా కృషి చేస్తామని తెలిపారు.