
తేది:18-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా నూతన వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా డా ఆకుల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా వైద్యాధికారిగా పనిచేసిన డా కె ప్రమోద్ కుమార్ డిప్యూటేషన్ పై పెద్దపెల్లి జిల్లాకు వెళ్ళారు. వైద్య సిబ్బంది నూతన డిఎంహెచ్వో గా బాధ్యతలు స్వీకరించిన డా ఏ శ్రీనివాసుకు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాన్నీ అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి
డా ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, ఏ ఏం ఓ సత్యనారాయణ, ఎన్ హెచ్ ఎం ,డి పి ఓ రవీందర్, హెచ్ ఈ ఓ లు రామ్ కుమార్ ,శ్రీధర్, రాజేశం, హెల్త్ ఎడ్యుకేటర్స్ కటకం భూమేశ్వర్, తరాల శంకర్, సూపర్వైజర్లు శ్రీనివాస్, శ్యామ్, మురళి ,తదితరులు పాల్గొన్నారు.