టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు చైతన్య లేదా శోభిత ఈ విషయంపై అధికారికంగా స్పందించనప్పటికీ, అక్కినేని అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఇటీవల ఓ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. “మీరు త్వరలో తాత కాబోతున్నారా?” అని ప్రశ్నించగా.. ఆయన ఆ వార్తలను ఖండించకుండా, “సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే స్వయంగా చెబుతాను” అని అర్థవంతమైన సమాధానం ఇచ్చి దాటవేశారు. నాగార్జున వ్యాఖ్యలతో చై-శోభితల గురించి వస్తున్న వార్తలు నిజమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
శోభిత ధూళిపాళ్ల గత కొన్ని ఈవెంట్లలో కనిపించిన తీరు, ఆమె దుస్తుల శైలిని గమనించిన నెటిజన్లు అప్పట్లోనే ఆమె గర్భవతి అని సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ జంట తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. అక్కినేని వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.