

తేది:18-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా:రాయికల్ మండలము అల్లిపూర్ గ్రామములో గల స్థానిక రాజరాజేశ్వర స్వామి దేవాలయములో మాస శివరాత్రి సందర్బంగా 22వ మాస శివరాత్రి మహా రుద్రాభిషేకం కార్యక్రమము నిర్వహించారు. ఇట్టి కార్యక్రమములో నూతనముగా ఎన్నుకోబడిన అల్లిపూర్ గ్రామ పంచాయతి పాలక వర్గానికి స్వామి వారి శేష వస్రాలతో ఘనంగా సన్మానించడం జరిగినది ఇట్టి కార్యక్రమము ఆలయ ప్రధాన అర్చకులు అంగడి మఠం భువనేశ్వర్ ఆధ్వర్యములో హనుమాన్ భజన మండలి వారి సహకారముతొ నిర్వహించడం జరిగినదని దేవాలయ అనువంశిక ధర్మ కర్తల మండలి అధ్యక్షులు నామని శేకర్ తెలిపినారు. ఇట్టి కార్యక్రమము ఉద్దేశించి గ్రామ సర్పంచ్ ఎంబరి గౌతమి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అల్లిపూర్ గ్రామముకు స్థానిక శివాలయముకు నేను ఎల్లవేలల రుణపడి ఉంటానని, ఆలయ అవసరానికి తన వంతూ కృషి చేస్తానని తెలిపినారు. ఇట్టి కార్యక్రమములో గ్రామ పంచాయతి ఉప సర్పంచ్ గురులింగు మఠం వినయ్ మరియు 13 మంది వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ భజన మండలి అద్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి చిట్యాల భూమయ్య, నామని లక్ష్మి నర్సయ్య, సభ్యులు మిత్తపెల్లి దామోదర్, అనుమల్ల మల్లేశం, వేముల వెంకటయ్య, ఎల్లేశ్వరం అశోక్, ఎంబరి మల్లేశం, సాగి వేణు రావు, ఎండపెల్లి శేఖర్, అనుమల్ల రాజేశం, పోల రమేష్, రజినీకాంత్, అంగడి పరమేశ్వర్, బొజ్జ శ్రీనివాస్ రావు మరియు ఉప్పుమడుగు గ్రామ మాజీ సర్పంచ్ వినోద్ రావు చెల్ గల్ గ్రామ భజన పరులు శంకర్ స్వామి మరియు అయ్యప్ప స్వామిల బృందం తదితరులు పాల్గొనారు.