జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్, అన్ని మండల కేంద్రాల్లోని పోలింగ్ సెంటర్లను పరిశీలించిన-జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్

తేది:17-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జిల్లాలో మూడవ విడత పోలింగ్ శాతం 79.64 … మొత్తం 1,71,920 ఓట్లలో పోలైన ఓట్లు 1,36,917.

జగిత్యాల జిల్లా:జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ధర్మపురి మండలం జైన, రాజారం, రాయపట్నం గ్రామాలు, వెల్గటూర్ మండల కేంద్రం, ఎండపల్లి, రాజారాంపల్లి మరియు గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలం నంచర్ల మరియు బతికేపల్లి గ్రామాలు, వెల్గటూర్ , గొల్లపల్లి మండల కేంద్రం
పోలింగ్ సరళిని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడవ విడత ఎన్నికల పోలింగ్ 79.64 శాతం నమోదు అయింది. బుగ్గరం,ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపెల్లి, పెగడపెల్లి, వెల్గటూర్
మండలాల్లో బుధవారం పోలింగ్ నిర్వహించారు.6 మండలాల్లో కలిపి మొత్తం ఓట్లు 1,71,920 ఉండగా పోల్ 1,36,917 అయ్యాయి.79.64 శాతం పోలింగ్ నమోదు అయింది.

మండలాల వారిగా ఓటర్లు.. నమోదు అయిన పోలింగ్ శాతం.

బుగ్గారం:మండలంలో మొత్తం ఓటర్లు 17,347మంది ఉండగా, 13,496 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.8 శాతం నమోదు అయింది.
ధర్మపురి:మండలంలో మొత్తం ఓటర్లు 34,638మంది ఉండగా, 25,302 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 73.05 శాతం నమోదు అయింది.
ఎండపెల్లి:మండలంలో మొత్తం ఓటర్లు 22,825 మంది ఉండగా, 19,110 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 83.72 శాతం నమోదు అయింది.
గొల్లపెల్లి:మండలంలో మొత్తం ఓటర్లు 39,658 మంది ఉండగా, 32,065 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.85 శాతం నమోదు అయింది.
పెగడపెల్లి:మండలంలో మొత్తం ఓటర్లు 34,768 మంది ఉండగా27,855 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.12 శాతం నమోదు అయింది.
వెల్గటూర్ :మండలంలో మొత్తం ఓటర్లు 22,684 మంది ఉండగా, 19,089 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.15 శాతం నమోదు అయింది.
జగిత్యాల జిల్లాలో 3వ దశ పోలింగ్‌లో భాగంగా బుధవారం ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది హాజరు, మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, త్వరితగతిన పూర్తి అయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆర్ ఓ అధికారులకు ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, నోడల్ ఆఫీసర్లు రఘువరన్, నరేష్, మదన్మోహన్, రేవంత్, జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, జగిత్యాల డీఎస్పీ రఘు చందర్, సంబంధిత ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *