పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన-కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు.

తేది:17-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్.

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు.

సంగారెడ్డి జిల్లా: మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
నిజాంపేట్ మండల కేంద్రంతో పాటు ర్యాల
మడుగు గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, పోలింగ్ బూత్‌లలో చేపట్టిన ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ విధానం, ఓటర్లకు అందుతున్న సౌకర్యాలు, ముఖ్యంగా వికలాంగులు మరియు వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపా
యాలను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఎన్నికల సిబ్బందికి సూచనలు చేశారు.
అనంతరం కల్హేర్ మండలం రాపర్తి గ్రామంలోని కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, తదితరాలను పరిశీలించి తగిన మార్గదర్శకాలు ఇచ్చారు.
ఎన్నికల సాధారణ పరిశీలకులు కార్తీక్ రెడ్డి నిజాంపేట్, బాచిపల్లి, మీర్‌ఖాన్‌పేట్, రాపర్తి, కడ్పల్, సిర్గాపూర్, చాప్ట(కె), ఆకుల లింగపురం గ్రామాల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వాసర్, కంగ్టి, కల్హేర్, కడ్పల్ గ్రామాల పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాలలో పరిస్థితులు, ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివిధ ఫారాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని,ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు
కున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *