



తేదీ: 17-12-2025 TSLAWNEWS పటాన్చెరు మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా:పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 56 మంది పారిశుధ్య కార్మికులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కార్మికుల భద్రత, గౌరవం పెంపొందించే దిశగా ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అనంతరం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుకు చెత్త సేకరణ రిక్షాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొంటూ, చెత్తను నిర్దిష్టంగా సేకరించే విధానానికి సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, ప్రయాణికుల సౌకర్యార్థం మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ బస్ షెల్టర్లు ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు పట్టణానికి మరింత అభివృద్ధి ముఖచిత్రాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డీఈ వెంకటరమణ, సీఐ వినాయక్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.