పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

తేదీ: 17-12-2025 TSLAWNEWS పటాన్చెరు మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు

పటాన్చెరు: రామచంద్రపురం, పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన అంశాలపై తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రామచంద్రాపురం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెన్షనర్లను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే, తమ సేవాకాలంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల పట్ల చూపిన నిబద్ధత రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచిందన్నారు. పరిపాలనలో అనుభవానికి, సమర్థతకు పెన్షనర్ల పాత్ర ఎప్పటికీ విలువైనదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో పెన్షనర్ల సూచనలు కీలకంగా ఉంటాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్, పెన్షనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *