కొరివి పల్లి గ్రామపంచాయతీ నూతన కార్యవర్గం ఏర్పాటు –మేడ్చల్ మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హన్మంత రావు గారి అభినందనలు.

తేది :16-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS శంకరంపేట (R)మండల రిపోర్టర్ శివలింగని సమ్మయ్య.

మెదక్ జిల్లా: తెలంగాణరాష్ట్రంలో నిర్వహించిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో, మెదక్ జిల్లా శంకరంపేట (ఆర్) మండలం కొరివి పల్లి గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డ్ సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హన్మంత్ రావు గారు పాల్గొని, ప్రజల మద్దతుతో విజయం సాధించిన నూతన ప్రజాప్రతినిధులను అభినందించారు. గ్రామాభివృద్ధి దిశగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
కొరివి పల్లి గ్రామపంచాయతీ నూతన కార్యవర్గం వివరాలు:
సర్పంచ్ : పూల కాంతారావు,
ఉప సర్పంచ్ : నర్సింలు,
వార్డ్ సభ్యులు:
సుధాకర్, సుభాష్,మంజుల,భిక్నూర్ రాములు,భాగ్య,కెలోత్ మౌనిక,నర్సింలు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నూతన కార్యవర్గంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *