
తేది:16-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వుమన్నసంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్.
చదువుకునే పిల్లలకు చట్టాల పైన అవగాహన కల్పించాలి- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి సౌజన్య.
సంగారెడ్డి జిల్లా: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి. భవానిచంద్ర గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు బాలసదన్, సంగారెడ్డి నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి. సౌజన్య గారు గారు తనికి నిర్వహించటం జరిగినది.
ఈ తనికి లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి. సౌజన్య గారు మాట్లాడుతూ పిల్లలకు అన్ని చట్టలపైనా అవగాహనా ఉండాలి అన్నారు. అందరు క్రమశిక్షణగా ఉండాలి అన్నారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు అదేవిదంగా వారి యొక్క బాగోగులను కూడా చూడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అని తేలిపారు. విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి అన్నారు.మంచి చదువులు చదివి ఉన్నత ఎదుగుదల ఎదగాలని అన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులు న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, సంగారెడ్డిని సంప్రదించగలరు.