
తేది:16-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: మంగళ వారం మోతే వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుమానితులకు క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై రోగులకు పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ మహమ్మారి వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాకు మొబైల్ యూనిట్ ఎక్స్ రే వచ్చినదని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. క్షయ వ్యాధి మందులు అన్ని కేంద్రాలలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, సరియైన పద్ధతిలో మందులు వాడితే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా ఎన్ శ్రీనివాస్, డా స్రవంతి , ఏ ఎం ఓ సత్యనారాయణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.