తేదీ:16-12-2025, జనగామ జిల్లా,TSLAWNEWS మండల రిపోర్టర్ Maroju Bhaasker
జనగామ జిల్లా:పాలకుర్తి మండలం వావిలాల గ్రామ బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, తాజా మాజీ ఎంపీటీసీ అశోక్ ఆ పార్టీకి రాజీనామా చేసి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బిఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో వావిలాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడినట్టుగా కార్యకర్తలు భావిస్తున్నారు..