తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో)లో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్ని కోట్లైన ఇచ్చి కొంటాం ⁉️తెలంగాణలో గుసగుసలు…

తేది:16-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

తెలంగాణ: టీజీవో ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం బరిలోకి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఒకరు,హైదరాబాద్ ఉద్యోగ సంఘం నుంచి మరో వ్యక్తి , మహబూబ్ నగర్ నుంచి ఒకరు, వరంగల్ కేంద్రంగా పని చేస్తున్న ఓ ఉద్యోగి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పని చేస్తున్న అధికారి మరొకరు, టీజీవో ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం బరిలోకి దిగారని సమాచారం. దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా గుసగుసలు చర్చనీయంగా మారింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో)లో ప్రధాన కార్యదర్శి పదవికి పలువురు పోటీ పడడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు వారం రోజుల నుంచి ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత కార్యవర్గం నుంచే ప్రధాన కార్యదర్శిని ఎన్నుకొనేందుకు ఒక వైపు అభిప్రాయ సేకరణ జరుగుతుండగా, మరో వైపు గతంలో టీజీవోను గుప్పిట పెట్టుకుని సర్వాధికారిగా వ్యవ హరించిన ఓ నేత కనుసన్నల్లో కొంతమంది ఉద్యోగులు రంగంలోకి దిగారు. వరంగల్ కేంద్రంగా పని చేస్తున్న ఓ ఉద్యోగి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఒకరు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పని చేస్తున్న అధికారి మరొకరు, మహబూబ్ నగర్ నుంచి ఒకరు, హైదరాబాద్ ఉద్యోగ సంఘం నుంచి మరో వ్యక్తి టీజీవో ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం బరిలోకి దిగారు. అయితే వీరంతా సుదీర్ఘకాలంగా ఆదాయ వన రులు అధికంగా ఉండే కీలక శాఖల్లో పని చేయడం, వారికి ఓ ప్రధాన పార్టీ సహకారం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. టీజీవోలో కార్యదర్శి పోస్టు దక్కించుకు న్నాక ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఆవ కాశం ఉందనే ముందస్తు సమాచారాన్ని సేకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు, ఆ వివరాలను ప్రభుత్వానికి చేరవేశాయని తెలిసింది. దీంతో పోటీకి దిగాలనుకునే వారి ఆర్థిక లావాదేవీలు, వారి మద్దతుదారుల కదలికలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. ప్రస్తుతం టీజీవో అధ్యక్షుడిగా ఒకరు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండటంతో ప్రధాన కార్యదర్శి పోస్టుకు ఎస్సీ లేదా బీసీ వర్గాల నుంచి ప్రాతినిధ్యం కల్పించాలనే అభిప్రాయం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుత కార్యవర్గంలోనే ఆయా వర్గాల నుంచి సమర్థుడైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు రెండు, మూడు పేర్లను ఎంపిక చేసిన టీజీవో కార్యవర్గం ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. సుమారు 70 శాతం మంది ఉద్యోగులు కార్యవర్గంలో ఉన్న వారిలో ఓ వ్యక్తి ఎంపికకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో టీజీవోలో చక్రం తిప్పిన ఓ నేత కనుసన్నల్లో కొంతమంది ఎన్నికల బరిలో ఉంటా మంటూ ఉద్యోగులతో సమావేశాలు పెట్టడంతో ఎన్నికలు తప్పవనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగితే ఎంత ఖర్చు పెట్టి అయినా ప్రధాన కార్యదర్శి పోస్టు దక్కించుకునేందుకు పోటీ పడుతుండటం. ప్రభుత్వం దీనిపై నిఘా పెట్టడం చర్చనీయాంశం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *