తేది:15-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడవ విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య, ఎన్నికల సాధారణ పరిశీలకులు కార్తీక్ రెడ్డి సమక్షంలో సోమవారం నిర్వహించారు.
కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో నిబంధనలను అనుసరిస్తూ ర్యాండ
మైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు.
ఏకగ్రీవం అయిన వాటిని మినహాయిస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న మిగిలిన గ్రామ పంచా
యతీలకు సంబంధించి ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు.అదేవిధంగా
మైక్రో అబ్జర్వర్ల ను
ర్యాండమేషన్ ద్వారా కేటాయించారు.
ఈ ప్రక్రియలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ , మ్యాన్ పవర్ నోడల్ అధికారి, డిఇఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.