తేది:15-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS మండల్ రిపోర్టర్ Maroju Bhaskar.
జనగామజిల్లా:సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ బలపరిచిన అభ్యర్థి అనంతోజు రజితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా కోరారు. సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు గెలిస్తే పాలకుర్తి సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అవకాశవాదులను ఓడించాలని నీతి నిజాయితీకి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన మహిళ యోధురాలు అనంతోజు రజిత అని, ఆమె గెలుపు పాలకుర్తి ప్రజానీకానికి అత్యంత అవసరమని ఆయన అన్నారు. ప్రజా సమస్యలనే తమ ఎజెండాగా మేనిఫెస్టో ప్రకటించామని, తాము గెలిస్తే దానిని అమలు చేస్తామని రమేష్ రాజా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజు సాంబయ్య, సర్పంచ్ అభ్యర్థి అనంతోజు రజిత, మహంకాళి శ్రీనివాస్, కొనకటి కళింగరాజు, గాయాల బాబు, పెద్ది రాహుల్ తదితరులు పాల్గొన్నారు.