

తేది:15-12-2025 TSLAWNEWS కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ Godishala Ramesh.
కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ది సాధ్యంఅని,పార్టీ బలపరిచిన అభ్యర్థులనే ఎన్నుకోవాలని కోరిన-పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు.
పెద్దపల్లి జిల్లా:పెద్దపల్లి మండలం నిట్టూరు, పెద్దకల్వల మరియు అప్పన్నపేట గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ,
కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ తోనే పల్లెల ప్రగతి సాధ్యమవుతుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి చేయవచ్చని, దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా వొడిదుడుకులను
ఎదుర్కొంటూనే అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెల్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఉచిత కరెంటు, రెండు లక్షల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంపు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ, సన్నవడ్లపై బోనస్, కటింగ్ లు లేకుండా వడ్ల కొనుగోలు వంటి ప్రజా ఉపయోగ పనులను తాము అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించి ఎన్నికల్లో తాము బలపరిచే అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు చేయబోయే పనులను వివరించగా వాటన్నిటికీ ఎమ్మెల్యేగా నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రెండేళ్ల పదవీ కాలంలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేశానని, గ్రామాల్లో తాను సూచించిన వారిని సర్పంచులుగా గెలిపిస్తే గ్రామాలు అభివృద్ది బాటలో పయనిస్థాయిని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.