

తేది:15-12-2025 TSLAWNEWS ఆంధ్రప్రదేశ్.
విజయభాస్కర్ ను పరామర్శించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు.
ఆంధ్రప్రదేశ్: టిడిపి వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు విజయ భాస్కర్‌ను సోమవారం వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. గారు స్వయంగా వెళ్లి పరామర్శించారు. రాయచోటి ఎన్జీఓ కాలనీలో ఉన్న విజయభాస్కర్ నివాసానికి చేరుకునీ, దాడి జరిగిన పరిణామాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు.విజయభాస్కర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వారు, ఆయనపై జరిగిన దాడిని హేయమైనది, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైనదన్నారు. ఇలాంటి రాజకీయ హింసను టిడిపి నాయకత్వం అరికట్టాలని వారు కోరారు.ఎలాంటి పరిస్థితులలోనైనా కార్యకర్తలకు ఎల్లవేళలా వైఎస్ఆర్ సీపీ పార్టీ అండగా నిలుస్తుందని, భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని విజయభాస్కర్‌కు భరోసా ఇచ్చారు రమేష్ యాదవ్.
ఈ కార్యక్రమంలో రామాపురం జడ్పిటిసి మా రమణ. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆర్లసుబ్బయ్య, ట్రేడ్ రాష్ట్ర కార్యదర్శి యూనియన్ చిన్న సంజీవయ్య, , బీసీ సెల్ కన్వీనర్ నాగరాజు యాదవ్, రాష్ట్ర పబ్లిక్ సిటీ సెక్రెటరీ రమణ గౌడ్. జిల్లా ఆగ్రనేజర్ సెక్రటరీ సుగవాసి శ్యాం కుమార్. జిల్లా టూరిజం కౌన్సిలర్ నెంబర్ కొత్తిమీర ప్రసాద్. సోషల్ మీడియా నాయకులు సురేష్ కుమార్ రెడ్డి. రైతు ఖాదరవాషా. సాయి. సురేష్. బీసీ నాయకులు బొమ్మిశెట్టి వెంకటరమణ.అమీర్ భాష. రామానుజులు. రెడ్డి శేఖర. వెంకటేష్. జూలు. మస్తాన్. పలువురు పాల్గొన్నారు..