జగిత్యాల జిల్లాలో రెండవ విడత పోలింగ్ శాతం 78.34, మొత్తం 2,08,168 ఓట్లలో పోలైన ఓట్లు 1,63,074 – జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్

తేది:14-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల పోలింగ్ 78.34 శాతం నమోదు అయింది.బీర్ పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించారు.
7 మండలాల్లో కలిపి మొత్తం ఓట్లు 2,08,168 ఉండగా పోల్ 1,63,074 అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 78.34 శాతం పోలింగ్ నమోదు అయింది.
మండలాల వారిగా ఓటర్లు, నమోదు అయిన పోలింగ్ శాతం.
బీర్ పూర్ మండలంలో మొత్తం ఓటర్లు 17,491మంది ఉండగా, 14,037 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.25 శాతం నమోదు అయింది.
జగిత్యాల మండలంలో మొత్తం ఓటర్లు 9,727 మంది ఉండగా, 7,904 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.26 శాతం నమోదు అయింది.
జగిత్యాల రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 45,021 మంది ఉండగా, 34,976 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.69 శాతం నమోదు అయింది.
కొడిమ్యాల మండలంలో మొత్తం ఓటర్లు 37,977 మంది ఉండగా, 29,787 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.43 శాతం నమోదు అయింది.
మల్యాల మండలంలో మొత్తం ఓటర్లు 40,307 మంది ఉండగా, 31,060 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.06 శాతం నమోదు అయింది.
రాయికల్ మండలంలో మొత్తం ఓటర్లు 37,959 మంది ఉండగా, 30,031 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 79.11 శాతం నమోదు అయింది.
సారంగాపూర్ మండలంలో మొత్తం ఓటర్లు 19,686 మంది ఉండగా, 15,279 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.61 శాతం నమోదు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *