

తేది:12-12-2-25 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల: అదనపు కలెక్టర్ బి ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కలెక్టరేట్ ఏవో హకీమ్, ఎలెక్షన్ సూపరిండెంట్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం రోజున దరూర్ క్యాంప్ లో ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ,జగిత్యాల ఆర్డీవో మధుసూదన్,ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కలెక్టరేట్ ఏవో హకీమ్, ఎలెక్షన్ సూపరిండెంట్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ ,వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.