తేదీ: 12-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్ జిల్లాలో పోలింగ్ శాతం 88.46%
రాష్ట్రవ్యాప్తంగా 84.28% నమోదు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉత్సాహంగా కొనసాగింది. డిసెంబర్ 11, 2025న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం 84.28% పోలింగ్ నమోదైంది.
మెదక్ జిల్లా మరోసారి అధిక పోలింగ్ నమోదు చేసిన జిల్లాల్లో ఒకటిగా నిలిచింది. జిల్లాలో మొత్తం 1,63,148 మంది ఓటర్లలో 1,44,323 మంది ఓటు హక్కు వినియోగించగా, తుది పోలింగ్ శాతం 88.46%గా అధికారులు ప్రకటించారు.
మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ 86%కు చేరుకోవడంతో చివరి శాతం మరింత మెరుగై 88.46% కు చేరింది.
జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అఘటితలు లేకుండా, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
తొలి దశలో మెదక్ జిల్లా అత్యధికంగా ఓటర్లు పాల్గొన్న జిల్లాల్లో ముందంజలో నిలవడం గమనార్హం.